సాహితీ వార్తలు

సుంకోజి దేవేంద్రాచారికి కె.ఎన్‌. జయమ్మ స్ఫూర్తి పురస్కారం
సజనకారుడు, కవి, చిత్రకారుడు, నవలాకారుడు ”అన్నం గుడ్డ” కథా రచయిత, ”నీరు నేల మనిషి” నవలా రచయిత సుంకోజి దేవేంద్రాచారికి కె.ఎన్‌ జయమ్మ స్ఫూర్తి పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు నిర్వాహకులు పలమనేరు బాలాజీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పురస్కారాన్ని ఆగస్టు 6న పలమనేరు- గంగవరం, సాయి గార్డెన్‌ సిటీలోని కళామందిరంలో నిర్వహించే సాహిత్య సభలో అందజేయనున్నట్టు పేర్కొన్నారు. వివరాలకు 9440995010 నంబరు నందు సంప్రదించవచ్చు.
30న సినారె పురస్కారాలు
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మహాకవి సినారె కళాపీఠం ఆధ్వర్యంలో సినారె పురస్కారాలు అందివ్వనున్నారు. ఈ నెల 30న ఆదివారం ఉదయం 10 గంటలకు జడ్చర్ల గంగాపురం రోడ్‌లోని ప్రేమ్‌రంగా గార్డెన్స్‌లో సభ నిర్వహించున్నారు. ప్రత్యేక పురస్కార స్వీకర్తలు వేణుశ్రీ, డా|| రాయారావు సూర్యప్రకాశ్‌రావు, ఉమ్మడి జిల్లాల వారీగా గురిజాల రామశేషయ్య, డా|| మచ్చ హరిదాసు, డా|| టి.శ్రీరంగస్వామి, కందుకూరి శ్రీరాములు, ఎన్‌.సిహెచ్‌. చక్రవర్తి, పొద్దుటూరి మాధవీలత, కొరుప్రోలు మాధవరావు, ఎన్వీ.రఘువీర్‌ ప్రతాప్‌, తగుళ్ళ గోపాల్‌, తోకల రాజేశంలకు అందివ్వనున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డా|| నందిని సిధారెడ్డి అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్చర్ల శాసనసభ్యులు డా|| సి.లక్ష్మారెడ్డి, గౌరవ అతిథిగా తెలంగాణ సంగీత నాటక అకాడమీ తొలి అధ్యక్షులు బాద్ని శివకుమార్‌, ఆత్మీయ అతిథిగా జాతీయ సాహితీ పరిషత్తు జడ్చర్ల అధ్యక్షులు చిగుళ్ళపల్లి పద్మలీల రానున్నారు.
నేడు ‘మణిపూర్‌ మారణహోమం’పై కవి సమ్మేళనం
తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో ‘మణిపూర్‌ మారణహోమం’పై సాయంత్రం 6 గం||కు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. వివరాలకు 9490099083, 8897765417 నంబర్ల నందు సంప్రదించవచ్చు.

Spread the love