నవతెలంగాణ-హైదరాబాద్: ఇండియా బ్లాక్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సోనియా గాంధీ సహా 20 మంది ఎంపీలు సంతకాలు చేశారు. NDA కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల ప్రారంభంలోనే అనూహ్యంగా జగదీస్ దన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనివార్యంగా వచ్చే నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగ
కాగా, తెలంగాణకు చెందిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి.. నాలుగున్నరేళ్ల పాటు 2007 నుంచి 2011 వరకూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అంతకుముందు 2005 నుంచి 2007 వరకు గువహటి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.