– భూ నిర్వాసితులకు మార్కెట్ ధర ఇవ్వాలి : జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
– నర్సాపూర్‌లో భూ నిర్వాసితులతో కవిత ముఖాముఖి
నవతెలంగాణ-నర్సాపూర్
రీజినల్ రింగ్ రోడ్‌లో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని, బాధితుల పక్షాన పోరాడుతామని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో త్రిబుల్‌ఆర్‌లో భూములు కోల్పోయిన రైతులతో ఆమె ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్‌లో భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లిస్తామని లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో భూములు కోల్పోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కొందరు భూస్వాముల భూములను కాపాడేందుకు గత ప్రభుత్వంలో రీజనల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను మార్చిందని అన్నారు. దాంతో అనేకమంది పేద రైతులు భూములు, కళాకారుల ఇండ్లు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రీజినల్ రింగ్ రోడ్‌లో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగేంతవరకు వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తానని తెలిపారు. అనంతరం అసంపూర్తిగా నిలిచిపోయిన కాలేశ్వరం ప్రాజెక్టు పనులను ఆమె సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు పాల్గొన్నారు.
త్రిబుల్ ఆర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



