Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెలుగుమట్ల భూబాధితులకు న్యాయం చేయాలి 

వెలుగుమట్ల భూబాధితులకు న్యాయం చేయాలి 

- Advertisement -

సబ్ కలెక్టర్‌కు తెలంగాణ జాగృతి వినతి
నవతెలంగాణ –  కామారెడ్డి

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూబాధితులకు న్యాయం చేయాలని, కూల్చిన ఇండ్లను అక్కడే మళ్లీ నిర్మించాలంటూ తెలంగాణ జాగృతి నాయకులు కామారెడ్డి జిల్లా సబ్ కలెక్టర్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ప్రధాన ద్వారం వద్ద ధర్నా  నిర్వహించిన అనంతరం వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సంపత్ గౌడ్ మాట్లాడుతూ వెలుగుమట్ల ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన భూబాధితులకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత మూడు రోజులుగా భూబాధితులకు అండగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావం తెలుపుతున్నామని తెలిపారు.  పోలీసుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు వసంత, ఆటో యూనియన్ అధ్యక్షుడు అల్తాఫ్, క్రిస్టియన్ విభాగం అధ్యక్షుడు డానియల్, స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు రాజేష్, ఎస్టీ అధ్యక్షుడు జైల్ సింగ్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి జొన్నల రాము, వినోద్, సమంత, ఝాన్సీ రాణి, దివ్య ప్రియ,  బలరాం, తహేర్, ఎండి అన్వర్, లింగంపేట్ మండల అధ్యక్షుడు పుల్క సాయిలు, మధు, ప్రవీణ్, మోహిర్, ముస్తాక్, ఖదీర్, మసూద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -