భూపాలపల్లి జిల్లా కలెక్టర్కు నిర్వాసితుల వినతి
నవతెలంగాణ – మల్హర్ రావు
తాడిచెర్ల ఓసీపీకి డేంజర్ జోన్లో ఉన్న అర్హులైన స్థానికులకు న్యాయం చేయాలని సోమవారం భూ నిర్వాసితులు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు దాదాపు 50 నిర్వాసితులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడారు అధికారులు సర్వే చేస్తున్న నేపథ్యంలో అర్హులైన ఇండ్ల పేర్లు లిస్ట్ రాకుండా అనర్హుల,స్థానికేతరుల పేర్లు వచ్చాయని ఆందోళన చెందారు.
అధికారులు ప్రామాణికంగా ఆధార్,రేషన్,2022 సంవత్సరంలో పిఎన్ పబ్లికేషన్,జీపీ కార్యాలయంలోని డిమాండ్,ఆన్లైన్,విద్యుత్ మీటర్లు,టిఎస్ జెన్కో నెంబర్లు తదితరవి ఉన్న తమ పేర్లు సర్వే జాబితా లిస్ట్ లో పేర్లు రాలేదని కలెక్టర్కు విన్నవించారు.ఇందుకు కలెక్టర్ సానుకూలంగా సంధించి జీపీ కార్యాలయంలో త్వరలోనే గ్రామసభ నిర్వహించి అర్హులకు న్యాయం చూస్తామని చెప్పినట్లుగా తెలిపారు.కాగా గత రెండు వారాల క్రితం నిర్వాసితులు కలెక్టర్ ను కలిసిన విషయం విదితమే.



