Tuesday, September 23, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంప్రపంచ నిపుణుల కోసం కే వీసా

ప్రపంచ నిపుణుల కోసం కే వీసా

- Advertisement -

ప్రవేశపెడుతున్న చైనా
యువతను ఆకర్షించడమే లక్ష్యం
అమెరికా హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపుతో నిర్ణయం

బీజింగ్‌ : అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం హెచ్‌-1బీ వీసా ఫీజును గణనీ యంగా పెంచేయడంతో ప్రపంచ దేశాలలోని నిపుణులైన ఉద్యోగులను ఆకర్షిం చేందుకు చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. సులభతరమైన ‘కే వీసా’ల మంజూరుతో అమెరికాకు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణ యించింది. వివిధ దేశాలకు చెందిన యువతను, నిపు ణులను ఆకర్షించడానికి జిన్‌పింగ్‌ ప్రభుత్వం ఈ కొత్త వీసా కేటగిరీని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మాథమెటిక్స్‌ రంగాలకు చెందిన యువ నిపుణులకు ప్రాధాన్యత ఇస్తారు. కొత్తగా కే వీసా కేటగిరీని ప్రారంభిస్తున్నట్లు చైనా ప్రభు త్వం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. కొత్త వీసా కేటగిరీకి చైనా ప్రభుత్వం ఆగస్టులోనే ఆమోదం తెలపడం గమనార్హం. అయితే విదేశీయుల ప్రవేశాలు, నిష్క్రమణలకు సంబం ధించిన నిబంధనలను తాజాగా సవరించారు.

వీరు దరఖాస్తు చేసుకోవచ్చు
చైనా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కే వీసా అమెరికా హెచ్‌-1బీ వీసాతో సమానమని పరిశీలకులు తెలిపారు. ఇది అమెరికా వీసాకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలకు చెందిన నిపుణులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చైనా న్యాయ శాఖ అందించిన వివరాల ప్రకారం యువ శాస్త్ర, సాంకేతిక నిపుణులకు కే వీసా అందుబాటులో ఉంటుంది. చైనాలో లేదా విదేశాలలోని పేరొందిన యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల నుంచి వచ్చిన పట్టభద్రులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వారు ఆయా విద్యా సంస్థల నుంచి బ్యాచ్‌లర్‌ డిగ్రీ పొంది ఉండాలి. లేదా వివిధ రంగాలలో ఉన్నత విద్యను అభ్యసించి ఉండాలి. సంబంధిత అధి óకారులు నిర్దేశించే విద్యార్హతలు ఉన్న వారు వాటిని ధృవీకరించే పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎన్నో ప్రయోజనాలు
ప్రస్తుతం అమలులో ఉన్న 12 సాధారణ వీసాలతో పోలిస్తే కే వీసా ఉన్న వారిని ఎంతో వెసులుబాటు ఉంటుంది. ఈ వీసాలను ఎక్కువ సంఖ్యలో జారీ చేయడం జరుగుతుందని, దీని కాలపరిమితి, నివాస కాలం కూడా ఎక్కువేనని అధికారులు తెలిపారు. కే వీసాల దరఖాస్తుదారులకు చైనా సంస్థలు లేదా యజమానుల నుంచి ఇన్విటేషన్‌ పొందాల్సిన అవసరం ఉండదు. దరఖాస్తు ప్రక్రియ కూడా సులభతరంగా ఉంటుంది. చైనా కార్మికుల అభివృద్ధి కోసం అనుసరిస్తున్న వ్యూహాన్ని రాబోయే కాలంలో మరింత వేగవంతంగా అమలు చేయడానికి ఈ నిర్ణయం దోహదప డుతుంది. జాతీయ ఇమ్మిగ్రేషన్‌ విభాగం అందించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో చైనాకు రాకపోకలు సాగించిన విదేశీయుల సంఖ్య 38.05 మిలియన్లకు చేరింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 30.2 శాతం అధికం. వీరిలో 13.64 మిలియన్ల మంది వీసాలు లేకుండా చైనాకు వచ్చిన వారే. అంతకు ముందు సంవత్స రంతో పోలిస్తే వీరి సంఖ్య ఏకంగా 53.9 శాతం పెరగడం గమనార్హం.

బీజింగ్‌ బాట పట్టొచ్చు
కొత్తగా హెచ్‌-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారు లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలంటూ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో చైనా తాజాగా కే వీసాలు ప్రవేశపెట్టడం విశేషం. అమెరికా ప్రభుత్వం నిర్ణయించిన అధిక ఫీజు కారణంగా హెచ్‌-1బీ వీసా భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. దక్షిణాసియాకు…ముఖ్యంగా భారత్‌కు చెందిన వేలాది మంది నిపుణులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పుడు వీరు చైనా బాట పట్టేందుకు కే వీసాలు ఎంతగానో ఉపకరిస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -