- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం కళ్యాపూర్ గ్రామ సర్పంచ్ రెమ్మ భానుచందర్, పాలకవర్గ సభ్యులు సోమవారం ప్రభుత్వ సలహాదారులు, భోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డిని సాయంత్రం హైదరాబాదులోని తన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ అభివృద్ధి కోసం తమరి సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాలేరు శ్రీకాంత్, లవన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, జావీద్, సురేందర్ గౌడ్, ధనుంజయ్, లింగారాం, ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



