Sunday, July 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబాధితులకు అండగా కల్లుగీత కార్మిక సంఘం

బాధితులకు అండగా కల్లుగీత కార్మిక సంఘం

- Advertisement -

ప్రమాదవశాత్తు గాయపడిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి :
రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ, జనగామ జిల్లా కార్యదర్శి బాల్నె వెంకట మల్లయ్య
నవతెలంగాణ – హైదరాబాద్‌

బాధితులకు కల్లుగీత కార్మిక సంఘం అండగా ఉంటుందని, ప్రమాదవశాత్తు గాయపడిన వారికి ఆర్థిక సాయం అందిస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకట రమణ, జనగామ జిల్లా కార్యదర్శి బాల్నె వెంకట మల్లయ్య అన్నారు. జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు కుర్రెంల ఆదినారాయణ గౌడ్‌ ప్రమాదవశాత్తు తాడిచెట్టుపై నుంచి జారిపడ్డాడు. ఈ ఘటనలో రెండు కాళ్లు, చెయ్యి, నడుము విరిగి శాశ్వత వికలాంగుడ య్యాడు. యశ్వంతపూర్‌ గ్రామానికి చెందిన మరో గీత కార్మికుడు రామగోని అంజయ్యకు కాలు చేయి విరిగింది. వీరిని నాగోల్‌ లోని సుప్రజ హాస్పిటల్‌లో వారు పరామర్శించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు గాయపడిన కల్లు గీత కార్మికులకు ఉచిత వైద్యం అందిస్తామని సుప్రజ హాస్పిటల్‌ ఎండీ డాక్టర్‌ శిగ విజరు కుమార్‌ గౌడ్‌ గతంలో మాటిచ్చారని గుర్తుచేశారు. ఆ మాట ప్రకారం ప్రస్తుతం గాయపడిన ఇద్దరు గీత కార్మికులకు ఉచిత వైద్యం అందిస్తున్నారన్నారు. శాశ్వత వికలాంగులైన వారికి ప్రభుత్వం వెంటనే రూ.10 లక్షల చొప్పున ఎక్సిగ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకో వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గీత కార్మికులు చెట్టుమీద నుంచి పడి చనిపోవడం, వికలాంగులవడం వంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచూ చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా వత్తిదారులున్నారని గుర్తుచేశారు. ప్రమాద నివారణకు కాటమయ్య రక్షణ కవచం కింద ఇప్పటివరకు 20 వేల మందికి మాత్రమే ఆర్థిక సాయం అందిందని గుర్తుచేశారు. వృత్తిదారులందరికీ ఈ పథకం వర్తింపజేసి ప్రమాదాలు నివారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతరం యాదగిరిగుట్టలో నిర్వ హించిన కేజీకేఎస్‌ రాష్ట్ర మహాసభలకు హాజర య్యారు. మూడేండ్లుగా దాదాపు 82 మందికి ఉచిత వైద్యం అందించిన సుప్రజా హాస్పటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ విజరు కుమార్‌ గౌడ్‌ను, సిబ్బందిని రాష్ట్ర కమిటీ తరఫున అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -