Tuesday, November 4, 2025
E-PAPER
Homeఆదిలాబాద్రిమ్స్ ను పరిశీలించిన కల్వకుంట్ల కవిత

రిమ్స్ ను పరిశీలించిన కల్వకుంట్ల కవిత

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
రిమ్స్ లో రోగులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మంగళవారం  రిమ్స్ ను పరిశీలించి రోగుల ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఇక్కడి ప్రభుత్వ హాస్పిటల్ లో సౌకర్యాలు ఎలా ఉన్నాయన్నది చూడటానికి వచ్చామన్నారు. ఇక్కడున్న జూనియర్ డాక్టర్స్, నర్సులు పేదవాళ్ల కోసం పనిచేస్తున్నారని, పేషెంట్లకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరికీ వైద్యం అందిస్తున్నారన్నారు. అలాంటి జూనియర్ డాక్టర్స్ డిమాండ్లు కొన్ని ఉన్నాయని వాటిని ప్రభుత్వం తీర్చాలని అన్నారు. హాస్పిటల్ లో శానిటేషన్ చాలా దారుణంగా ఉందని చాలా వాసన వస్తుందని పేర్కొన్నారు. దీని గురించి డైరెక్టర్ కు చెప్పమని పాత ఏజెన్సీ మార్చామని చెప్పారని పేర్కొన్నారు. రోగులకు ఇక్కడకు వచ్చాక వారికి మంచి వాతావారణం ఉండాలని, గతంలో శానిటేషన్ కోసమే ప్రత్యేక బడ్జెట్ ఇచ్చే వాళ్లమని ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చేశారన్నారు.

ఇక్కడ పేషెంట్లను నాగ్ పూర్ కు వెళ్లామంటున్నారని తెలిసిందని హాస్పిటల్ లో కార్డియాలజిస్ట్ ను కచ్చితంగా నియమించాలన్నారు. ఆదిలాబాద్ లో పెద్ద ఎత్తున క్యాన్సర్ కేసులు కూడా నమోదవుతున్నాయని ఇన్ని అడవులతో మంచి వాతావారణం ఉన్న జిల్లాలో క్యాన్సర్ కేసులు రావటమా అని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున పెరుగుతున్న క్యాన్సర్ కేసులపై కమిటీ వేయాలని జిల్లా ప్రజలకు సంబంధించి హెల్త్ ప్రొఫైల్ స్టడీ చేయాలని కోరుతున్నా. రిమ్స్ హాస్పిటల్ లో విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయని వారికి సరైన రెస్ట్ రూమ్స్, ఫెసిలిటీస్ లేవన్నారు. మన తెలంగాణ ఆరోగ్యాన్ని కాపాడే విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పించాలని ఆరోగ్య శాఖకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ లో ఒక లిప్ట్ పనిచేయకపోవటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని ఎక్కువ మంది మైనార్టీ వర్గానికి చెందిన వారు హాస్పిటల్ కు వస్తున్నారని వారికి మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రభుత్వం త్వరితగతిన హాస్పిటల్ లో అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కవిత వెంట నాయకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -