– స్పందించిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్
నవతెలంగాణ – కామారెడ్డి
వర్షాల కారణంగా కామారెడ్డి డిగ్రీ కళాశాలకు సంబందించిన ప్రహరి గోడ కర్షక్ బీ.ఈడి వెనుక సైడ్ గోడ కూలిపోయింది. ఆ గోడ రోడ్డుపై పడడంతో 14వ వార్డు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో విషయం తెలుసుకున్న తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి వచ్చి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఈ గోడ మూడుసార్లు కూలీ పోవడం వల్ల కాకతీయ నగర్ కాలనీ, 14వ వార్డ్ ప్రజలు గోడ పడిపోయిన ప్రతిసారి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి ఏడాది ఇలాంటి పరిస్థితి వస్తుందని, మున్సిపల్ అధికారులకు, డిగ్రీ కళాశాల, శిశు మందిర్ సిబ్బందికి సమాచారం అందించారు.
సత్వరమే సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను సూచించారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ కు ఫోన్ లో వివరించి సోమవారం సాయంత్రం 6 గంటలకు కళాశాల కమిటీ సమావేశం అయి పూర్తి స్థాయి పరిష్కారం చేయాలనీ కోరారు. ఈ నేపథ్యంలో డిగ్రీ, కర్షక్ కళాశాల, శిశు మందిర్, కాలనీ వాసులు సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. సమాచారం తెలుసుకున్న డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్స్పాల్ కిష్టయ్య సంఘటన స్థలానికి చేరుకోగా కాకతీయ నగర్ కాలనీ వాసులు, 14వ వార్డ్ ప్రజలు నిలదిశారు. డిగ్రీ కళాశాల, కర్షక్ బీ.ఈడి కళాశాల, శిశు మందిర్ తీరు పట్ల కాకతీయ నగర్ కాలనీ, 14వ వార్డ్ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తు ఆందోళన చేశారు.
వర్షాలకు కూలిన కామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రహరి గోడ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES