నవతెలంగాణ – జుక్కల్ !
జుక్కల్ గ్రామంలో 30 పడకల ఆస్పత్రిని కామారెడ్డి జిల్లా వైద్యాధికారి రవీందర్ గౌడ్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో పేదలకు అందిస్తున్న చికిత్స వివరాలను వైద్యుడు విఠల్ ను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆస్పత్రి పరిశుభ్రంగా ఉందని అన్నారు. రోగులకు సౌకర్యాలు అన్ని విధాలుగా కల్పించాలని స్థానిక వైద్యుడిని ఆదేశించారు.
ఆస్పత్రికి సంబంధించిన మందులు ఎప్పటికప్పుడుకప్పుడు ఇండెంట్ పెట్టి తెప్పించుకోవాలని సూచించారు. అంతకుముందు జుక్కల్ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, మరియు ఆస్పత్రికి వైద్యుడు తో కలిసి విల్ల వైద్యాధికారికి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు ,జుక్కల్ జిపి కార్యదర్శి , జూనియర్ అసిస్టెంట్ , ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



