Wednesday, January 7, 2026
E-PAPER
Homeకరీంనగర్కందేపికి ఆంధ్ర సారస్వత పురస్కారం

కందేపికి ఆంధ్ర సారస్వత పురస్కారం

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో సిరిసిల్లకు చెందిన స్థానిక సృజన్ పిల్లల ఆసుపత్రికి భాషా సేవా పురస్కారం లభించింది. త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా ఆంధ్ర సారస్వత సేవా పురస్కారాన్ని సృజన్ పిల్లల ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ పిల్లల రచయిత్రి డాక్టర్ కందేపి రాణీప్రసాద్ గుంటూరు జిల్లా అమరావతిలో జరిగిన ప్రపంచ తెలుగు సభల్లో అందుకున్నారు. కర్ణాటక రాష్ట్ర మాజీ స్పీకర్ రమేష్ కుమార్ , మహా సహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ  శాలువా, గోల్డ్‌మెడల్ అందించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన మూడు రోజుల ప్రపంచ తెలుగు మహాసభల సదస్సులో డా. కందేపి రాణిప్రసాద్ ఆంధ్ర సారస్వత పురస్కారాన్ని అందుకోవడం మన జిల్లాకు గర్వకారణమని సిరిసిల్ల జిల్లా రచయితలు పేర్కొన్నారు.

గత 25 సంవత్సరాలుగా సృజన్ పిల్లల ఆసుపత్రి ప్రిస్కిప్షన్ ప్యాడ్‌పై పిల్లల కోసం తెలుగు పాటను ప్రింటు చేస్తున్నారు. మందులు, ఇంజక్షన్లు ఉండాల్సిన ఆసుపత్రిలో తెలుగుకు చోటు కల్పించడం డా.కందేపి ప్రసాదరావుకు ఉన్న తెలుగు భాషా ప్రేమను తెలియజేస్తున్నది.సృజన్ ఆసుపత్రి గోడల నిండా తెలుగు పొడుపు కథలు అంటించి ఉండడంతో, పూర్వం నుంచి పొడుపు కథల ఆసుపత్రి అనే పేరును పొందింది.ఆసుపత్రిలోని వైద్య పరికరాలకు, మానవ శరీర అవయవాలకు, వైద్యపరీక్షలకు తెలుగులో పాటలు పొడుపుకథలు రచించిన బాలసాహితీ డా.కందేపి రాణీప్రసాద్ ప్రశంసనీయురాలు. ఈ విషయమై డా. రాణీప్రసాద్‌తో మాట్లాడినప్పుడు, తాము గత పాతిక సంవత్సరాలుగా చేస్తున్న తెలుగు భాషా కృషికి ఈనాడు గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ మహాసభలలో అనేక మంది గవర్నర్లు, మారిషస్ దేశాధినేత, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు , వేలాది మంది అభిమానులు ఉత్సవ వాతావరణంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -