Wednesday, July 23, 2025
E-PAPER
Homeసినిమా'కాంతార చాప్టర్‌ 1' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘కాంతార చాప్టర్‌ 1’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

‘రాజకుమార, కెజిఎఫ్‌, సలార్‌, కాంతార’ వంటి మైల్‌ స్టోన్‌ చిత్రాలతో ప్రశంసలు పొందిన నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్‌. ప్రస్తుతం ఈ బ్యానర్‌ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటైన ‘కాంతార చాప్టర్‌1’ను రూపొందిస్తోంది. రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నారు.
ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్‌లుక్‌, బర్త్‌ డే స్పెషల్‌ పోస్టర్‌తో ట్రెమండస్‌ రెస్పాన్స్‌ తెచ్చుకుంది.
తాజాగా నిర్మాతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. దాదాపు 250 రోజుల షూటింగ్‌, మూడు సంవత్సరాల కష్టం అంతా మిక్స్‌ అయిన ఈ వీడియో ఒక సినిమాటిక్‌ ఫెస్టివల్‌లా కనిపించింది. కేవలం బీహైండ్‌ ది సీన్స్‌ అనిపించకుండా సినిమా పుట్టిన తీరుని అద్భుతంగా చూపించారు. విభిన్న భూభాగాలు, కాంప్లెక్స్‌ సెటప్‌లలో పనిచేసే భారీ టీమ్‌ కలిగి ఉన్న ఈ వీడియో రిషబ్‌ శెట్టి డెడికేషన్‌కు ట్రీబ్యూట్‌లా ఉంది. సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న బి. అజనీష్‌ లోకనాథ్‌ ఆల్రెడీ తన స్పిరిచువల్‌ టచ్‌తో అద్భుతం అనిపించారు. డివోషనల్‌ విజువల్స్‌ను ఆర్ట్‌ డైరెక్టర్‌ వినేష్‌ బంగ్లాన్‌ అద్భుతంగా డిజైన్‌ చేశారు. సినిమాటోగ్రఫీ విషయంలో అరవింద్‌ కాశ్యప్‌ వర్క్‌ కూడా ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తోంది. అక్టోబర్‌ 2న గ్లోబల్‌గా రిలీజ్‌ కానున్న ఈ సినిమా కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్‌ భాషల్లో రానుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -