నవతెలంగాణ – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కాంతి హైస్కూల్లో కాంతి హై స్కూల్ యొక్క 27వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించినారు. ఇట్టి కార్యక్రమంలో కాంతి హై స్కూల్ వ్యవస్థాపకులు మరియు ప్రిన్సిపల్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ.. గత 27 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేకమంది విద్యార్థిని విద్యార్థుల వారి తల్లిదండ్రుల యొక్క నమ్మకం మాపైన ఉన్నందున దానికి అనుగుణంగా మా పాఠశాల యొక్క లక్ష్యాలను గుర్తు చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. విద్యార్థుల యొక్క క్రమశిక్షణ పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి మా లక్ష్యంగా సాగుతూ వారి ఆశయాలకు అనుగుణంగా విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పులను చేస్తూ వారి ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నామన్నారు. ఈ సంవత్సరం రెండు వందలకు పైన అడ్మిషన్లతో కొనసాగుతు విద్యార్థినీ విద్యార్థుల యొక్క సంపూర్ణ అభివృద్ధి కొరకు మరియు తల్లిదండ్రుల నమ్మకాన్ని కోల్పోకుండా మా వంతుగా ప్రయత్నం చేస్తామని తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేసినారు.
ఘనంగా కాంతి హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -