నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో భారతమాత భజన మండలి ఇందూర్ వారి ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజన మహోత్సవం. ఈ కార్యక్రమానికి ఆశ్రమాధిపతులు శ్రీ శ్రీ శ్రీ బాలయోగి కృష్ణ మహారాజ్ , శ్రీ శ్రీ శ్రీ మధుసూదన నంద సరస్వతి మహారాజ్ నేతృత్వం వహించి భక్తులకు ఆధ్యాత్మిక బోధనలు అందించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు.. “ భారతమాత భజన పరివార్ – ఇందూర్ నిర్వహిస్తున్న ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దారి తీస్తాయి. యువతలో భక్తి, సేవా భావం పెంపొందించడంలో ఇలాంటి ప్రయత్నాలు కీలకo.. కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలిపారు. “ధర్మో రక్షిత రక్షిత:” ధర్మాన్ని మనం కాపడితే ధర్మం మనల్ని కాపాడుతుంది.. హిందూ సనాతన ధర్మం పరిరక్షణలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనదని తెలిపారు. మన హిందూ ధర్మం ఎంతగా పెరుగుతుందో దానికి హిందూ వ్యతిరేక శక్తులు కూడా అంతగా తయారవుతున్నాయి.. దీన్ని పసిగట్టి మన హిందూ ధర్మ ప్రచారానికి నారీశక్తి ముందువరుస లో ఉండాలని సూచించారు..ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే ని ఘనంగా సత్కరించారు.
అదేవిధంగా శ్రీ శ్రీ శ్రీ పిట్ల కృష్ణ మహారాజ్ , శ్రీ శ్రీ శ్రీ మధుసూదన నంద సరస్వతి మహారాజ్ సనాతన ధర్మంపై లోతైన ప్రవచనాలు ఇచ్చి భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం అందించారు.
ఈ కార్యక్రమoలో నిర్వహకులు వైట్ల.సుబ్బారావ్ గారు, ప్రముఖ వక్త.లక్ష్మణరావు గారు, మెగా. సుబేదార్ గారు, శ్రీ గణేష్ గారు, V. H. P గంగా కిషన్ గారు, కాపర్తి.గురుచరణ్ గారు, బీజేపీ నాయకులు మాజీ కార్పొరేటర్ ప్రభాకర్ గారు, మఠo. పవన్ గారు, మారవార్ కృష్ణ గారు, తదితరులు పాల్గొన్నారు..



