- Advertisement -
నవతెలంగాణ నకిరేకల్
కార్తీక పౌర్ణమి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఐశ్వర్య సాయి మందిరం గీతా మందిరం తో పాటు వివిధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు పుణ్య స్థానాలు ఆచరించి ఆలయాలలో కార్తిక దీపాలు వెలిగించారు.దేవాలయాల్లో, వివిధ గ్రామాల్లో సత్యనారాయణ స్వామి, కేదరీనాథ్ నోములు, వ్రతాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్ గౌడ్, శివాలయం చైర్మన్ ఉప్పల రమేష్, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
- Advertisement -



