Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారం డివిజన్ పాస్టర్స్ కమిటీ ఎన్నిక

కాటారం డివిజన్ పాస్టర్స్ కమిటీ ఎన్నిక

- Advertisement -

అధ్యక్షుడిగా యాళ్ల సుందర్ రావు
నవతెలంగాణ – కాటారం

కాటారం మండలం బెరాక గుడ్ న్యూస్ చర్చ్‌లో డివిజన్ పాస్టర్స్ కమిటీ ఎన్నికలు శుక్రవారం  మాజీ అధ్యక్షుడు డేవిడ్ మార్క్ ఆధ్వర్యంలో ఐదు మండలాల పాస్టర్స్ సమక్షంలో నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడిగా యాళ్ల సుందర్ రావు ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా జాన్ పాల్, కార్యదర్శిగా జోషి, జాయింట్ సెక్రటరీగా బి. ప్రకాష్, ఖజానాదారుడిగా బన్సీలాల్, జాయింట్ ట్రెసరర్లుగా రమేష్, ఏకు సతీష్ కుమార్, అడ్వైజర్‌గా నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బాబురావు, అభిషేక్, సి.హెచ్ జాన్ తదితరులను ఎన్నుకున్నారు.

అనంతరం  మాజీ అధ్యక్షుడు డేవిడ్ మార్క్ మాట్లాడుతూ… నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కాటారం డివిజన్‌లోని చర్చిల అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులపై ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

నూతన అధ్యక్షుడు యాళ్ల సుందర్ రావు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పాస్టర్స్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై పెట్టిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం మండల పాస్టర్స్ అధ్యక్షుడు దానియేలు, మహా ముత్తారం అధ్యక్షుడు తిమోతి, లూకా, ఐదు మండలాల పాస్టర్స్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -