- Advertisement -
రోడ్డుపై గుంతలు పూడ్చివేత కృతజ్ఞతలు తెల్పిన ప్రయాణికులు, ప్రజలు
నవతెలంగాణ – కాటారం
కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కొన్ని నెలలుగా ప్రమాదకరంగా మారిన భారీ గుంతలు స్థానిక ప్రజలను, వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ గుంతలు కారణంగా రోజూ వందలాది వాహనాలు ఇరుక్కుపోయే పరిస్థితి నెలకొనగా.. రాత్రి వేళల్లో ప్రమాదాలు సంభవించే అవకాశం మరింత ఎక్కువైంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు గ్రామపంచాయతీ కార్యదర్శి షగీర్ ఖాన్ ముందడుగు వేశారు. అంబేద్కర్ గారేపల్లి చౌరస్తాలో ఉన్న రహదారి గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించి తక్షణమే పనులు పూర్తిచేశారు. స్థానికులు, ప్రయాణికులు ఈ చర్యపై సంతోషం వ్యక్తం చేశారు.
- Advertisement -