నవతెలంగాణ – కట్టంగూర్
ఈనెల 19న కట్టంగూర్ ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నట్లు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.ఈనెల 11న మొదటి దశలో కట్టంగూరు గ్రామపంచాయతీ ఎన్నికలు జరగగా 14 వార్డులో గాను ఇరుపక్షాలు చెరో ఏడు వార్డులు గెలుపొందాయి. అదేరోజు రాత్రి ఉపసర్పంచ్ ఎన్నిక జరగాల్సి ఉండగా కోరం లేకపోవడంతో వాయిదా పడింది. మళ్లీ 12న గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్ ఎన్నికకు సమావేశం ఏర్పాటు చేసినా వార్డు సభ్యులు ఎవరు హాజరు కాకపోవడంతో మళ్లీ సమావేశం వాయిదా పడింది. దీంతో ఎన్నికల సంఘం ఈనెల 19న ఉప సర్పంచ్ ఎన్నిక గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు అధికారిక ఉత్తర్వులలో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఏడుగురు వార్డు సభ్యులు, కాంగ్రెస్ రెబల్, మిత్రపక్షాల తరఫున ఏడుగురు వార్డు సభ్యులు గెలుపొందడంతో సర్పంచ్ ఓటు కీలకంగా మారింది. దీంతో సర్పంచ్ ఎవరికి మద్దతు తెలిపితే వారే ఉపసర్పంచ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో గత కొద్ది రోజులుగా ఉపసర్పంచ్ ఎవరు అవుతారనే అంశంపై ఉత్కంఠ వీడనుంది. ఇరుపక్షాలలో ఉపసర్పంచ్ అభ్యర్థి పై చర్చలు ఉత్కంఠ గా కొనసాగుతున్నాయి. సర్పంచ్ ప్యానల్ లోని 7గురు సభ్యులలో ఉప సర్పంచ్ గా ఎవరిని ఎన్ను కావాలో తర్జనభజనలు జరుగుతున్నాయి.
19న కట్టంగూర్ ఉప సర్పంచ్ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


