Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లుక్క గంగాధర్ ను సత్కరించిన కేబీఏ సభ్యులు

లుక్క గంగాధర్ ను సత్కరించిన కేబీఏ సభ్యులు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఇండోర్ స్టేడియంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక జాతీయస్థాయిలో పలు అవార్డులు పొందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ లుక్క గంగాధర్ ను సత్కరించారు. తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రఫీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గంగాధర్ నియమితులైన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

భవిష్యత్తులో మరిన్ని పదవులను అలంకరించి పేరు పైఖ్యాతలు పొందాలని ఈ సందర్భంగా కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు ఆకుల బాలకృష్ణ, పెంట కిషన్, సుంకట శ్రీనివాస్, సురంగి చంద్రశేఖర్, చిలువేరి పవన్ కుమార్, భోగ శ్యామ్, నడుకుడ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -