Saturday, September 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమరోసారి ఆస్పత్రికి కేసీఆర్‌

మరోసారి ఆస్పత్రికి కేసీఆర్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం వైద్య పరీక్షల నిమిత్తం గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రికి వెళ్లారు. సాధారణ ఆరోగ్య తనిఖీలలో భాగంగా ఆయన వరుసగా రెండో రోజు ఆసుపత్రికి వెళ్లడం గమనార్హం. కేసీఆర్ నిన్న మధ్యాహ్నం కూడా ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు ఆసుపత్రికి వచ్చిన కేసీఆర్, దాదాపు గంటసేపు అక్కడే ఉన్నారు. ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్, ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ నాగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్‌కు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని వైద్యులు తెలిపారు. అయితే, ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -