- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. పార్టీ తరపున ఆయన కుటుంబానికి రూ.2.25కోట్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఇందులో సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయల చొప్పున ఆర్థికసాయం అందంచనున్నారు. అలాగే సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున బాగోగుల కోసం మరో రూ.25 లక్షలు ఆమె పేరు మీద బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు.
- Advertisement -



