– వైద్యాధికారిణి డాక్టర్ సుప్రియ
– హాస కొత్తూర్ లో ఆరోగ్య శిబిరం
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చౌట్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ స్పందన అన్నారు. సోమవారం మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలో చౌట్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా గ్రామీణ గ్రంథాలయం భవనంలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరంలో వైద్యాధికారి డాక్టర్ సుప్రియ, డాక్టర్ స్పందన పాల్గొని గ్రామంలోని 54 మందికి వైద్య పరీక్షలు చేశారు.
అవసరమైన వారికి మందులను అందజేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి డాక్టర్ సుప్రియ వర్షాకాలంలో వచ్చే వ్యాధులను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ, అతిసారా, టైఫాయిడ్ లాంటి రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రజలు వర్షాకాలం ముగిసింతవరకు దోమలను వృద్ధి చెందకుండా మురికి నీటి నిల్వలను అరికట్టాలని, అదేవిధంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు.కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నరసయ్య, ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ, వైద్య సిబ్బంది మమత, అమృత, ఆశా కార్యకర్తలు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES