- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండల కేంద్రంలో కమ్మరి కొండయ్య ఇంటి వద్ద ఉన్న 7 హెచ్ పి బోరు మోటర్ రిపేర్ చేయించినట్లు కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కేశమోని శంకరయ్య గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెవెన్ హెచ్ పి బోర్ మండలంలోని చాలా చోట్లకు నీటి సరఫరా అవుతుందని తెలిపారు. పైప్ లైన్ డామేజ్ సరిచేసి రేపటి వరకు బోరు రిపేర్ అవుతుందని తెలిపారు. సొంత ఖర్చుతో రూ.12,000 తో ప్రజలు నీటికి ఇబ్బంది పడకూడదని సమస్యను పరిష్కరించానన్నారు.
- Advertisement -