Monday, October 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమీర్‌పేట్‌ మాధవి హత్య కేసులో కీలక పరిణామం

మీర్‌పేట్‌ మాధవి హత్య కేసులో కీలక పరిణామం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఈ ఏడాది జనవరి 16న మీర్ పేటలో మాధవి అనే వివాహితను ఆమె భర్త గురుమూర్తి అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. తాజాగా ఈ కేసు విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది. మాధవి హత్యకేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తులో సేకరించిన సైంటిఫిక్ ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ చేపట్టిన రెండు నెలల్లోనే తీర్పు వస్తుందని పేర్కొన్నారు. ఈనెల 17వ తేదీ నుంచి మాధవి హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు రోజువారీ ట్రయల్స్ జరపనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -