- Advertisement -
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి వాహనాన్ని శుక్ర వారం ఎన్నికల అధికారులు సిరిసిల్లలో తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇతర ప్రాంతాల నుండి సిరిసిల్లకు వచ్చే వాహనాలను ఎన్నికల నియమావళి ప్రకారం అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీనికి కేకే మహేందర్ రెడ్డి అధికారులకు పూర్తిగా సహకరించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తారని అధికారులు పేర్కొన్నారు.
- Advertisement -



