- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, టీమ్ ఇండియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. మూడో రోజు ఆటలో భాగంగా కేఎల్ రాహుల్ శతకంతో మెరిసాడు. మరోసారి లార్డ్స్ బోర్డులో తన పేరును లిఖించుకున్నాడు. కేవలం 177 బంతుల్లోనే శతకం(100) పూర్తి చేసుకున్నాడు. శతకం చేసిన ఒవర్ లోనే బ్రూక్ క్యాచ్ ఇచ్చి కేఎల్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం జడేజాతో పాటు నితీష్ క్రిజ్ లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 387 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. టీమ్‌ఇండియా ఇంకా 128 పరుగుల వెనుకంజలో ఉంది.
- Advertisement -