- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామంలో కోమటికుంట కట్టను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారుల ఆదేశాల మేరకు శనివారం హెల్పర్ రవి పరిశీలించారు. రోడ్డు నిర్మాణం చేపట్టాలని అక్టోబర్ 4న తాడిచర్ల కాపురం గ్రామాల జెన్కో భూనిర్వశిత హక్కుల సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోమటికుంట చెరువు నుండి ఎమ్మార్ ఆర్ అండ్ఆర్ ప్లాట్ల వరకు సిసి లేదా తారు రోడ్డు నిర్మాణం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -



