Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeదర్వాజకొంగు

కొంగు

- Advertisement -

అమ్మాయి!
చీరను వెక్కిరించకు
చిన్నతనంలో
దాని కొంగు పట్టుకునే తిరిగే దానివి.
వర్షంలో, ఎండల్లో
అదే నీకు గొడుగయ్యేది.
చెమటను తుడిచే
చెయ్యి అయ్యేది.
వేడి వేడి చాయను తాపించే
గ్లాసు కు అడుగయ్యేది
కన్నీళ్లు కారితే
తుడిచే ఓదార్పు హస్తమయ్యేది.
పట్టుచీరను కట్టుకొని
బతుకమ్మను మోసే
మా అమ్మ
జలదేవతలా ఉండేది
ఆ చీరె అంచున మెరిసే
పసిడి డిజైన్లు
నా కవిత్వానికి కాంతులు ప్రసాదించేవి.
మా అమ్మ చీరెలను
మా అక్క కూడా కట్టుకునేది.
చీర చెంగులు
ఇంద్ర ధను:తరంగాల్లా కదిలేవి
ఛాతి పై కప్పుకునే పైట
మమకార మాధుర్యాన్ని గుర్తుచేసేది.
అమ్మాయి!
చీరెను తీసిపారేయ్యకు
మీ ఆధునిక దుస్తుల్లో
సౌకర్యముండొచ్చు
కానీ సాంస్కతిక సౌందర్య మేదీ!
మా ఇంటికి ఓసారి రా!
మా రేకు పెట్టెలో దాచిన
మా అమ్మ చీరెను చూపిస్తాను.

డా. ఎన్‌. గోపి

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad