Tuesday, May 13, 2025
Homeతెలంగాణ రౌండప్ కొంగు బంగారం ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం..

 కొంగు బంగారం ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం..

- Advertisement -

పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
: ఈ ప్రాంత ప్రజలకు కొంగు బంగారంగా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఇస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హుస్నాబాద్ లో ఎల్లమ్మ తల్లి బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలకు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరిపై ఉండాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. మళ్ళీ పౌర్ణమి వరకు జరిగే ఉత్సవాలకు లక్షలాది మంది పాల్గొంటారన్నారు. ఎల్లమ్మ తల్లి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామని అన్నారు. హుస్నాబాద్ నాయకులు ప్రజలంతా మీకు ఆతిధ్యం ఇచ్చి ఉత్సవాలలో  భాగస్వామ్యం అవుతున్నారన్నారు. ప్రభుత్వం పక్షాన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కాకతీయుల కాలం నాటి నుండి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నుండి హుస్నాబాద్ ఎల్లమ్మ కీ చరిత్ర ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఎల్లమ్మ ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్  కేడం లింగమూర్తి, సింంగిల్ విండో చైర్మన్ బోలిసిటీ శివయ్య , ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -