నవతెలంగాణ – మల్హర్ రావు
క్లిన్ అండ్ గ్రీన్ రేటింగ్ 2025-26 సంవత్సరంలో జిల్లా స్థాయిలో ఉన్న ప్రయివేటు పాఠశాలకు స్వచ్ఛ ఎనం హరిత్ అవార్డు ఎంపికలో భాగంగా జిల్లాస్థాయిలో నిర్వహించిన నీరు, పారిశుధ్యం, పర్యావరణ, పరిశుభ్రత, స్థిరత్వంలో జాతీయ విద్యావిధానంలో దార్శనికతను అనుగుణంగా, పర్యావరణ పట్ల అంకితభావంతో 100 శాతానికి 86.40 అద్భుతమైన రేటింగ్ తో ప్రథమ స్థానంలో మండలంలోని కొయ్యుర్ గ్రామ విశ్వదీప్తి అప్పర్ ప్రాథమిక పాఠశాల నిలిచి స్వచ్ఛ ఎనం హరిత విద్యాలయ రేటింగ్ జిల్లా స్థాయి ఆసెస్మేంట్ అవార్డును గెలుసుకుంది. సోమవారం జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో జ్ఞాపీక,మేమేంటో,అవార్డును విశ్వదీప్తి పాఠశాల కరస్పాండెంట్ సుదర్శనన్, వైస్ ప్రిన్స్ పాల్ మేరీ కార్గిస్ దంపతులు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, ఎంఈఓ లక్ష్మన్ బాబుల చేతులమీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
స్వచ్ఛ ఎనం హరిత్ అవార్డ్ పొందిన కొయ్యుర్ విశ్వదీప్తి పాఠశాల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



