కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కొండ రాజమ్మ
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో కొయ్యుర్ గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కొండ రాజమ్మ అన్నారు. గతంలో ఉప సర్పంచ్ గా,జెడ్పిటిసిగా ప్రజలకు సేవలందించానని, సర్పంచ్ గా అవకాశం ఇస్తే ప్రజలకు నాయకురాలుగా కాదు సేవకురాలుగా 24 గంటలు అందుబాటులో ఉండి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్ళునట్లుగా తెలిపారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గెలిసిన వెంటనే అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలను అంధించేలా కృషి చేస్తానన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో కొయ్యుర్ ను అభివృద్ధి చేస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



