- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని పోసానిపేట శ్రీ సరస్వతి శిశు మందితో పాటు జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో శుక్రవారం వేడుకల్లో భాగంగా విద్యార్థుల గోపిక, శ్రీకృష్ణుని వేషాధారణ చూపరులను అలరించాయి. వేడుకల్లో విద్యార్థులు సంతోషంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు శ్యాంసుందర్రావు, ఉపాధ్యక్షులు గంగారెడ్డి, బొడ్డు శంకర్, ప్రణజిత్ మోహన్, ప్రతాప్ గౌడ్, ప్రిన్సిపాల్ నాగభూషణం, వైస్ ప్రిన్సిపాల్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -