- Advertisement -
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ నిజామాబాద్ ఆర్య నగర్ లోని ఫ్యూచర్ లైన్ పాఠశాలలో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు కృష్ణుని, గోపికల వేశాధారణతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ప్రియాంక, స్వప్న మాట్లాడుతూ.. విద్యార్థులకు సంస్కృతి, సంప్రదాయం గూర్చి తెలుపుతూ ప్రతి సంవత్సరలగానే ఈ సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించామని అన్నారు. అనంతరం విద్యార్థులతో ఉట్టి కొట్టించి ఆనంద పారవశ్యం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లావణ్య , సంధ్య, గౌతమి, మినాక్షి, శీరిష విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -