నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వస్త్ర పరిశ్రమలు విద్యుత్ సంక్షోభానికి గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ కారణమని లాల్ బహుట చేనేత పవర్ లూమ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పంతం రవి అన్నారు. వస్త్ర పరిశ్రమ విద్యుత్ సమస్యను పరిష్కరిస్తున్న సమయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి కి కేటీఆర్ లేఖ రాయడం ఒక డ్రామా. ఇప్పటికే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించిన విద్యుత్తు బ్యాక్ బిల్లింగ్ విషయంపై ఇక్కడి వస్త్ర పరిశ్రమ జేఏసీ అభ్యర్థన మేరకు ఇక్కడి నుండి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కే.కే మహేందర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి ఈ సమస్యను చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లకు వివరించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. వారు రెండు మూడు రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం కూడా జరిగిందని విద్యుత్ సమస్య పరిష్కారమయ్యే క్రమంలో లెటర్ రాసి క్రెడిట్ కొట్టేసే దుర్బుద్ధి తోనే బట్టి కి కేటీఆర్ లెటర్ రాయడం జరిగిందని ఆయన ఆరోపించారు.
వాస్తవానికి ఈ సమస్య ఉత్పన్నమైంది నీ హయాంలో కాదా. వస్త్ర పరిశ్రమను సంక్షోభంలో నెట్టడానికి ఎస్.ఎస్.ఐ .యూనిట్లు ఏర్పాటుచేసింది నీవు కాదా. వస్త్ర పరిశ్రమకు 50 శాతం విద్యుత్ సబ్సిడీని ఎత్తివేయాలని హైకోర్టుకు వెళ్ళింది మీ పార్టీ వారు కాదా. విద్యుత్ సమస్య పరిష్కారంకొరకు మీ సెస్ డైరెక్టర్ కు పరిశ్రమ యజమానుల నుండి 28,లక్షల రూ..ఇప్పించింది నీవు కాదా. సెస్ కు బకాయిపడిన 36 కోట్ల రూపాయలు కార్మికులు చెల్లించాల్సింది కార్మికుల యాజమా నుల..బతుకమ్మ చీరల ద్వారా కార్మికకుల కు సంవత్సర కాలానికి మూడు నెలల పని ఇప్పించి కార్మికుల తలరాతను మార్చాననిచెప్పుకోవడానికి సిగ్గుగా లేదా అని ఆయన అన్నారు. నీకు ఓట్లు వేసి గెలిపించిన పాపానికి పరిశ్రమలో సంక్షోభం ఏర్పడి కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏనాడైనా పరమార్శించావా. సమస్యల పరిష్కారం కొరకు కార్మికులు ఆసాములు యజమానులు రెండు నెలలు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోఆందోళన చేస్తే ఏనాడైనా స్థానిక ఎమ్మెల్యేగా ఇక్కడి సమస్యలపై అసెంబ్లీలో ఎప్పుడైనామాట్లాడా వా. ఇప్పటికైనా నీకు నిజాయితీ ఉంటే ఈ ప్రాంత ప్రజలకు నీవు చేసిన అన్యాయం పై బహిరంగ క్షమాపణలు చెప్పాలని పంతంరవి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నల్ల చంద్రమౌళి అధ్యక్షులు అజ్జ వేణు సంఘం నాయకులు సోమ నాగరాజు కొంక విజయ్ ఎనగంటి రాజు తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో విద్యుత్ సంక్షోభానికి కేటీఆర్ కారణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES