Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిజామాబాద్ లో ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

నిజామాబాద్ లో ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పిలుపు మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడులకను గురువారం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలు జరిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో గులాబీ శ్రేణుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి తమ అభిమాన హీరో కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు.

కేటీఆర్ కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్ధిస్తూ పలు ఆలయాలలో ప్రత్యేక పూజలుచేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు కేక్ కట్ చేసి కేటీఆర్ కు శుభాకాంక్షలుతెలిపారు. ఇదిలా ఉండగా ఆర్మూర్ నియోజక వర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించి ఆయనకు వివిధ రూపాల్లో బర్త్ డే విషెస్ తెలిపారు. ఎక్కడికక్కడ కేటీఆర్ ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. పేదలకు అన్నదానం చేశారు .రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పలు ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -