Friday, July 25, 2025
E-PAPER
Homeజిల్లాలుతాడ్వాయిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

తాడ్వాయిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

- Advertisement -

కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న యువకులు 
నవతెలంగాణ – తాడ్వాయి 

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ 49వ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గురువారం మండల కేంద్రంలో మేడారం ఆర్చ్ గేట్ వద్ద ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా మేడారం రహదారి లో హార్చ్ గేట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దండగల మల్లయ్య, ఇన్చార్జి కూనూర్ అశోక్ ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పటాకులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్స్ పంపించేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపారని కొనియాడారు. ఐటీ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఐటి హబ్ గా నిలవడంలో విశేష కృషి చేసిన నాయకుడు కేటీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు, మాజీ కోఆప్షన్ నెంబర్ దిలావర్ ఖాన్, ప్రధాన కార్యదర్శి పోగు నాగేష్, ఉపాధ్యక్షులు చల్ల రజినీకర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు సోమ నాగమ్మ, మాజీ మండల అధ్యక్షులు నూశెట్టి రమేశ్, మాజీ సర్పంచులు జాజ చంద్రం, ఆలేటి ఇంద్రారెడ్డి, సయ్యద్ హుస్సేన్ (వహీద్) నాయకులు శేషగిరి, వల్లెపు సారయ్య, బందెల తిరుపతి, సాంబయ్య బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -