నవతెలంగాణ – కంఠేశ్వర్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి జె గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని నాందేడ్ చౌరస్తాలో రాకేష్ కిషోర్ అనే మతోన్మాది దిష్టిబొమ్మలను మంగళవారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో దహనం చేశారు. అనంతరం కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్ మాట్లాడుతూ..అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తి పై బూటుతో విసిరేసే ప్రయత్నం చేశాడు. ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైనే కాదు భారత రాజ్యాంగం ప్రజల పైన విసిరినట్టు అవమానించే విధంగా ఆయన లోపల ఉన్న మనువాదము బయటకు వచ్చింది. ఇట్లాంటి దుశ్చర్యకు పాల్పడిన న్యాయవాది మతోన్మాది భారత ప్రజలకు న్యాయమూర్తికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.
భారత రాజ్యాంగం ప్రకారం అవమానించిన దూషించిన ఈ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నిజాంబాద్ తీవ్రంగా ఖండిస్తూ దోషిని వెంటనే అరెస్టు చేయాలని కఠినంగా శిక్షించాలని కుల దుర అహంకారమే వీటికి తారకారామని చట్టం ముందు అందరు సమానులే సనాతన ధర్మం కాపాడుకోవడం అంటే ఇదేనా భారత రాజ్యాంగం అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించింది మనువాద భావజాలంతో ఈ విధంగా చేయడం అనేటువంటిది సిగ్గుచేటు ఇలాంటి వాటికి నరేంద్ర మోడీ బాధ్యత వహించవలసి ఉంటుందని కెవిపిఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్వాల నరసయ్య, సిఐటియు జంగం గంగాధర్, ఎస్ఎఫ్ఐ రాజు, కే పద్మ, ఆంజనేయులు, అంజయ్య, గణేష్ పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని ఖండించిన కెవిపిఎస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES