Tuesday, November 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంలేబర్‌ కోడ్‌లతో మెడికల్‌ రిప్రజెంటేటీవ్స్‌కు నష్టం

లేబర్‌ కోడ్‌లతో మెడికల్‌ రిప్రజెంటేటీవ్స్‌కు నష్టం

- Advertisement -

– ఎస్‌పీ యాక్టు-1976ను పునరుద్ధరించాలి..కోడ్‌లను వెనక్కి తీసుకోవాలి : తెలంగాణ మెడికల్‌,సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌ యూనియన్‌ నేతలు
– కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ కమిషనరేట్‌ వద్ద ధర్నా
– లేబర్‌కోడ్‌ల ప్రతుల దహనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

లేబర్‌ కోడ్‌లతో మెడికల్‌ రిప్రజెంటేటీవ్స్‌కు తీవ్ర అన్యాయం జరగబోతున్నదని తెలంగాణ మెడికల్‌, సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌ యూనియన్‌(టీఎమ్‌ఎస్‌ఆర్‌యూ) ప్రధాన కార్యదర్శి సీహెచ్‌.భానుకిరణ్‌, అధ్యక్షులు పి.రాజుభట్‌, జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ ఎ.నాగేశ్వరరావు, ఏపీఎమ్‌ఎస్‌ ఆర్‌యూ ప్రధాన కార్యదర్శి వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేసి ఎస్‌పీఈ యాక్టు -1976ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. మోడీ సర్కారు తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌లను వ్యతిరేకిస్తూ సోమవారం హైదరాబాద్‌ విద్యానగర్‌లో కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ కమిషనరేట్‌ ఎదుట టీఎమ్‌ఎస్‌ఆర్‌యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. లేబర్‌ కోడ్‌ల ప్రతులను దహనం చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు ధర్నానుద్దేశించి వారు మాట్లాడుతూ… ఇప్పటికే సేల్స్‌పేరుతో మెడికల్‌ రిప్రజెంటేటీవ్‌లపై యాజమాన్యాల వేధింపులున్నాయనీ, కొత్త కోడ్‌లతో అవి మరింత తీవ్రరూపం దాల్చుతాయని వాపోయారు. సెల్స్‌ ప్రమోషన్‌ ఇండిస్టీగా గుర్తించాలని కోరారు. కొత్తకోడ్‌లలో మెడికల్‌, సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌కు సంబంధించి అపాయింట్‌మెంట్‌, సెలవులు, కనీస మౌలిక వసతుల కల్పన వంటివేవి కొత్త కోడ్‌లలో లేవని ఎత్తిచూపారు. ఇక నుంచి చట్టబద్ధమైన పనిదినాలు, పనిగంటలు ఉండవని తెలిపారు. కార్మికులకు, ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్న నాలుగు లేబర్‌ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎమ్‌ఎస్‌ఆర్‌యూ రాష్ట్ర నాయకులు ఏఎన్‌.చారి, జగదీశ్‌చారి, అప్రోజ్‌, సతీశ్‌, రాజ్‌కుమార్‌, కిశోర్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -