Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కస్తూర్బా పాఠశాలలో కనీస వసతులు కరువు 

కస్తూర్బా పాఠశాలలో కనీస వసతులు కరువు 

- Advertisement -

విద్యార్థులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ – కట్టంగూర్
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు.తాగునీరు, వసతి గృహాలు, మరుగుదొడ్లు, భోజన సదుపాయాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు తగిన స్థాయిలో లేవని విద్యార్థులు తన దృష్టికి తీసుకు వచ్చినట్లు చెప్పారు.గదులకు కిటికీలు లేకపోవడం, టాయిలెట్లకు తలుపులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులకు సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యంతో అన్నం వండడంతో మెత్తగా అయ్యి తినలేక పోతున్నారని చెప్పారు.బడుగు బలహీనవర్గాల విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని,అధికారులు కాంగ్రెస్ పార్టీకి దాసోహం అయి విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసారని విమర్శించారు.సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో గురుకులాలు నిర్వీర్యం అవుతున్నాయని అన్నారు.గురుకులాల్లో భోజన నాణ్యత దెబ్బతిని అనేక మంది విద్యార్థులు ఆసుపత్రి బారిన పడ్డారని, ఇకనైనా ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఆయన వెంట మాజీ జెడ్పిటిసి తరాల బలరాములు, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మంగదుడ్ల వెంకన్న, నాయకులు పెద్ది బాలనర్సింహ్మ, రెడ్డిపల్లి మనోహర్, పోగుల అంజయ్య, దాసరి సంజయ్, పోతరాజు నగేష్, మల్లేష్ ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img