Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లక్షలు పోశారు.. లక్షణంగా వదిలేశారు

లక్షలు పోశారు.. లక్షణంగా వదిలేశారు

- Advertisement -

– నిరుపయోగంగా మండల కాంప్లెక్స్ భవనం
– సంవత్సరాల తరబడి ఖాళీగా కాంప్లెక్స్ గదులు
– వేల ఆదాయాన్ని కోల్పోతున్న మండల పరిషత్ 
– అధికారులు దృష్టి సారిస్తే బాగుంటుందన్న ప్రజలు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద లక్షలు పోసి నిర్మించిన మండల కాంప్లెక్స్ భవనం నిరుపయోగంగా మారింది. మండల పరిషత్ కార్యాలయానికి అదనపు ఆదాయం కోసం 2023 సంవత్సరంలో నాలుగు గదులతో కాంప్లెక్స్ భవనాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన నాటి నుండి నేటి వరకు కాంప్లెక్స్ భవనంలోని నాలుగు గదులు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ కాంప్లెక్స్ భవనం ఆలన పాలన కరువ్వడంతో అసాంఘిక కార్యకలాపాలకు, మందుబాబులకు అడ్డగా మారింది. లక్షల రూపాయలు హెచ్చించి నిర్మించిన ఈ కాంప్లెక్స్ ప్రస్తుతం అధికారులకు, సిబ్బంది వాహనాల పార్కింగ్ కు పరిమితమైంది. గదులు వినియోగంలో లేకపోవడంతో గదుల ముందు చీమలు పుట్టలు పెడుతున్నాయి. అధికారుల ఇలాగే అలసత్వంతో వ్యవహరిస్తే భవిష్యత్తులో ఈ చీమలపూటల్లోకి పాములు దూర ఆస్కారం ఉంది.

మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 2021-22 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర రోడ్లు భవనాల, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి రూ.15 లక్షలు మంజూరు చేయడంతో నాలుగు గదులతో కాంప్లెక్స్ భవనాన్ని నిర్మించారు. 2022 ఫిబ్రవరిలో ఈ కాంప్లెక్స్ భవనాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకు నిర్మించిన నాలుగు షట్టర్ రూములను అద్దెకు అడిగే వారు లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. ఆర్భాటంగా నిర్మించిన గదులు నీటికి వినియోగంలోకి రాకపోవడంతో లక్షలు పోసి నిర్మించిన కాంప్లెక్స్ భవనం పాలకుల, అధికారుల అనాలోచిత నిర్ణయాలకు నిదర్శంగా నిలుస్తుంది. మండల పరిషత్ కార్యాలయం గ్రామంలో జాతీయ రహదారికి లోపలగా ఉండడం మూలంగా కాంప్లెక్స్ లోని గదులను ఎవరు అద్దెకు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. వినియోగంలోకి రానీ భవనాలు ఎన్ని నిర్మిస్తే ఏం లాభమని ప్రజలు అధికారులు, పాలకులను తీరును ప్రశ్నిస్తూ పెదవి విరుస్తున్నారు.

నిరుపయోగంగా తాళాలు వేసి ఉన్న నాలుగు గదుల కాంప్లెక్స్ భవనం, అద్దెకు తీసుకునే వారు లేకపోవడంతో నెలనెలా వేల రూపాయల ఆదాయాన్ని మండల పరిషత్ కార్యాలయం కోల్పోతుంది. లక్షలు వెచ్చించి నిర్మించిన కాంప్లెక్స్ భవనం వినియోగంలోకి తీసుకురాకపోతే వృధాగా మారి, శిథిలావస్థకు చేరుకునే ఆస్కారం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కాంప్లెక్స్ భవనం రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలకు, మందుబాబులకు అడ్డగా మారింది. గదుల ముందు చీమలు పుట్టాలని పెడుతున్నాయి. అధికారులు గదుల్ని వినియోగంలోకి తీసుకురాకపోతే భవిష్యత్తులో ఈ చీమల పుట్టలో పాములు ఆస్కారం ఉంది. ఇప్పటికైనా మండల పరిషత్ కార్యాలయ అధికారులు స్పందించి నాలుగు గదులతో ఉన్న మండల పరిషత్ కార్యాలయ కాంప్లెక్స్ భవనాన్ని తక్కువ ధర కైనా అద్దకివ్వడం ద్వారా వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -