- Advertisement -
క్రాంతి, ఉపేందర్ రెడ్డి ఏ ఇల్లు
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని లక్నవరం సరస్సు శనివారం సాయంత్రానికి మత్తడి పోస్తున్నట్లు సరస్సు ఏ ఈ లు క్రాంతి మరియు ఉపేందర్ రెడ్డిలు తెలిపారు. ఈ సందర్భంగా ఏ ఈ లు ఉపేందర్ రెడ్డి మరియు క్రాంతి లు మాట్లాడుతూ రాత్రివేళ ముత్తడి పెరిగే అవకాశం ఉన్నందున దయ్యాలవాగు పరివాహక ప్రాంతంలో వరద పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడితే వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున మండల కేంద్రంలో పరివాహక ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేరే ప్రమాదం ఉన్నందున జాగ్రత్త పడాలని అన్నారు. మత్తడి ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందని మత్తడి పోసే ప్రదేశంలో ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు.
- Advertisement -