– సెమీస్‌లో విక్టర్‌పై ఘన విజయం
– ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్స్
బర్మింగ్‌హామ్ (ఇంగ్లాండ్) : భారత అగ్రశ్రేణి షట్లర్, ఒలింపియన్ లక్ష్యసేన్ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో టైటిల్ పోరుకు చేరుకున్నాడు. తొలి రౌండ్లోనే వరల్డ్ నం.1, క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్ నం.6 షట్లర్లను చిత్తు చేసిన లక్ష్యసేన్ శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో విక్టర్ (కెనడా)పై మూడు గేముల మ్యాచ్‌లో పైచేయి సాధించాడు. 21-16, 18-21, 21-15తో లక్ష్యసేన్ 97 నిమిషాల్లోనే ఫైనల్లో బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. మూడు గేముల పాటు సాగిన సెమీఫైనల్లో లక్ష్యసేన్ తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గాడు. కానీ రెండో గేమ్‌లో విక్టర్ పుంజుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో అత్యుత్తమ ఆటతీరు కనబరిచిన లక్ష్యసేన్ ప్రత్యర్థిని చిత్తు చేశాడు. 21-15తో మూడో గేమ్‌తో పాటు ఫైనల్లో చోటు దక్కించుకున్నాడు. నేడు జరిగే ఫైనల్లో చైనీస్ తైపీ షట్లర్ లిన్ చున్ యితో లక్ష్యసేన్ తలపడనున్నాడు.
ఫైనల్లో లక్ష్యసేన్
- Advertisement -
- Advertisement -



