Monday, April 20, 2026
E-PAPER
Homeఆటలుప్రపంచకప్‌ బెర్త్‌ దక్కేనా?

ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కేనా?

- Advertisement -

నేటి నుంచి హాకీ క్వాలిఫయర్స్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌ :
ఎఫ్‌ఐహెచ్‌ మహిళల హాకీ ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది జరుగనున్న ప్రపంచకప్‌లో మూడు జట్లు ఈ టోర్నమెంట్‌ నుంచి అర్హత సాధించనున్నాయి. ఆతిథ్య భారత్‌తో పాటు ఇంగ్లాండ్‌, వేల్స్‌, ఉరుగ్వే, స్కాట్లాండ్‌, దక్షిణ కొరియా, ఇటలీ, ఆస్ట్రియాలు క్వాలిఫయర్స్‌ బరిలో నిలిచాయి. గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ క్వాలిఫయర్స్‌ పోటీలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. తొలి రోజు ఇంగ్లాండ్‌తో ఇటలీ.. ఆస్ట్రియాతో దక్షిణ కొరియా తలపడనున్నాయి. ఆతిథ్య భారత్‌ నేడు ఉరుగ్వేతో గ్రూప్‌ దశ మ్యాచ్‌తో వేట షురూ చేయనుంది. క్వాలిఫయర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో కూడిన సదుపాయాలు ఏర్పాటు చేసిందని ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్‌ రెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ సోనీబాలా దేవి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -