Tuesday, January 27, 2026
E-PAPER
Homeఖమ్మండిగ్రీ కళాశాలకు స్థలం కేటాయిస్తా: ఎమ్మెల్యే జారె

డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయిస్తా: ఎమ్మెల్యే జారె

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు స్థలం కేటాయించి, అధ్యాపకులు నియామకానికి కృషి చేస్తానని, అలాగే జూనియర్ కళాశాలలో సమస్యలను పరిష్కరిస్తానని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి,కళాశాలలో మౌలిక వసతులను పరిశీలించారు. 

అలాగే కళాశాలలో నిర్వహిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి ప్రిన్సిపాల్ నండ్రు గోపి, అధ్యాపకులు,విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని డిగ్రీ కళాశాలకు స్థలం,కళాశాల భవనం, అధ్యాపక పోస్టులను మంజూరు చేయించడానికి హామీ ఇచ్చారు.అలాగే జూనియర్ కళాశాలలో మరమ్మత్తులకు గురైన ఆర్ ఓ ప్లాంట్ ను ఉపయోగంలోకి తెప్పిస్తానని,అవసరం అయితే కొత్తగా ఆర్వో ప్లాంట్ మంజూరుకు హామీ ఇచ్చారు. అనంతరం బెస్ట్ ప్రిన్సిపాల్ అవార్డ్ పొందిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అల్లు అనిత ను అభినందించి సత్కరించారు. అలాగే జిల్లాస్థాయిలో బెస్ట్ లెక్చరర్ గా అవార్డు తీసుకున్న ఆర్.అరవింద్ బాబు ని కూడా సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు ఉత్తమ లెక్చరర్ రావడం అభినందనీయమని భవిష్యత్తులో వారు మరిన్ని అవార్డులు తీసుకోవాలని మరిన్ని ఉత్తమ సేవలు మన నియోజకవర్గానికి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గోపి, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు డిగ్రీ కళాశాల అధ్యాపకులు సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -