Saturday, November 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభూములు తీసుకున్నరు.. కంపెనీలేవీ?

భూములు తీసుకున్నరు.. కంపెనీలేవీ?

- Advertisement -

– భూనిర్వాసితులకు చాలీచాలని పరిహారం : తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత
– వెలిమినేడులో ‘జనం బాట’
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం

వెలిమినేడు గ్రామంలో ఎరోస్పేస్‌ కోసం ప్రభుత్వం రైతుల నుంచి భూములు తీసుకున్నా కంపెనీలను మాత్రం ఏర్పాటు చేయలేక పోతోం దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. భూ నిర్వాసితులకు చాలీచాలని నష్టపరిహారంతో చేతులు దులుపుకుందని విమ ర్శించారు. వెలిమినేడు గ్రామ రైతుల పక్షాన జాగృతి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామ న్నారు. జాగృతి ‘జనం బాట’లో భాగంగా శుక్ర వారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, కందు కూరు మండలాల్లో ఆమె పర్యటించారు. కందు కూరులో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అలాగే జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం మండలం వెలి మినేడు గ్రామంలో పర్యటించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో రైతులు తమ సమస్యలు చెప్పుకోవడానికి రాకుండా కొంత మంది అడ్డుకున్నారని విమర్శించారు. రైతులకు నష్టపరిహారం పూర్తిస్థాయిలో అందేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. భూములు కోల్పోయిన రైతాంగ కుటుంబాలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏ సమస్య అయినా చెప్పుకుం టేనే పరిష్కారానికి మార్గం దొరుకుతుం దని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు దుస్థితి అధ్వానంగా తయారయ్యాయని చెప్పారు. పేదలకు సరైన వైద్యం అందడంలేదని, ‘దూది ఉంటే సూది లేదు.. సూది ఉంటే దూది లేదు’ అని విమ ర్శించారు. ఇక పేదలకు నాణ్యమైన వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఇలాంటి సమస్యలు తెలుసుకునేం దుకు జనం బాట చేపట్టినట్టు తెలిపారు. కాంగ్రెస్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు చేసే వరకూ ఉద్యమిస్తామన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల మేలవింపుగానే జాగృతి ఉద్భవిం చిందని కవిత తెలిపారు. స్థానిక ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో మంచిరెడ్డి విజరుకిరణ్‌రెడ్డి, స్థానికులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -