- Advertisement -
నవతెలంగాణ – బెజ్జంకి: ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈవీ బస్సును లారీ డికొట్టిన సంఘటన శుక్రవారం మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. సుమారు 51 మంది ప్రయాణికులతో ఈవీ ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుండి హైదారాబాద్ వైపు వెళ్తుంది. రాజీవ్ రహదారిపై బస్సును అధిగమించే క్రమంలో ఆర్టీసీ బస్ వెనుకభాగంలో లారీ డికొట్టింది. బస్ వెనుకభాగం ధ్వంసమవ్వగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆర్టీసీ బస్ డ్రైవర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఏఎస్ఐ శంకర్ రావు శనివారం తెలిపారు.
- Advertisement -