Sunday, May 11, 2025
Homeసండే ఫన్నవ్వుల్‌పువ్వుల్‌

నవ్వుల్‌పువ్వుల్‌

- Advertisement -


మీరు, నేను ఒకటే టీచర్‌!
టీచర్‌: రాజూ, ఎప్పుడూ ఏదో ఒక తప్పుచేసి క్లాసులో నిలబడి ఉంటావు, సిగ్గులేదా?
రాజు: లేదు, టీచర్‌.. క్లాసు మొత్తానికి మనిద్దరమే నిలబడి ఉంటామని గర్వంగా ఉంటుంది.
తగ్గించడమెలా?
స్వీటీ వాళ్ల టీచర్‌.. ఆమె ప్రొగ్రెస్‌ రిపార్టులో ఇలా రాసింది… ”ఈ అమ్మాయి తెలివైనదే. కానీ, ఎక్కువగా మాట్లాడుతోంది. వాగుడు తగ్గించి పాఠాల మీద శ్రద్ధ పెడితే మంచి మార్కులు వస్తాయి. దీని కోసం మీరేదైనా మార్గం ఆలోచించాలి”
స్వీటీ తండ్రి ఆ ప్రోగ్రెస్‌ కార్డుపై సంతకం పెట్టి.. ఆమె కామెంట్‌ కింద ఇలా రాశాడు… ”మీ దగ్గర ఏమైనా ఉపాయం ఉంటే చెప్పండి. వీళ్ల అమ్మ మీద ప్రయోగించాలి”
ఎంత పెద్ద సహాయం
చింటూ : డాడీ… మీరు నా చదువు కోసం శ్రమ పడుతుంటే చూడలేకపోతున్నాను. అందుకే నాకు చేతనైన హెల్ప్‌ చేద్దామనుకుంటున్నాను.
తండ్రి : నువ్వా… ఏం చేయగలవు?
చింటూ : ఈసారి ఎగ్జామ్స్‌లో ఫెయిలవుతాను. మీరు కొత్త పుస్తకాలు కొనక్కర్లేదు
ప్రవేశం లేదు
ఇన్‌స్పెక్టర్‌ : ఆ ఇంట్లో దొంగ ఉన్నాడని తెలిసి కూడా పట్టుకోలేకపోయావా… ఎందుకని?
కానిస్టేబుల్‌ : ఇంటి ముందు ఇతరులు లోనికి ప్రవేశించరాదనే బోర్డుంది.
నన్నొదిలెరురా బాబూ…

కోళ్లఫారం యజమాని మహా శాడిస్టు. ఒక రోజు వాడు కోళ్లతో ఇలా అన్నాడు.. ”రేపటికి ఒక్కొక్క కోడి రెండేసి గుడ్లు పెట్టకపోతే కోసుకు తినేస్తా”
పాపం భయంతో కోళ్లన్నీ ఎలాగోలా కష్టపడి రెండేసి గుడ్లు పెట్టాయి. ఒకటి మాత్రం ఒక గుడ్డే చూపించింది.
యజమాని కోపంగా కారణం అడిగాడు.
దానికి ఆ కోడి, ”నీ అయ్య నువ్వన్న మాటకు భయపడి ఈ ఒక్కటైనా పెట్టాను, నిజానికి నేను పుంజుని. నన్నొదిలెరురా నీకు దండం పెడతా”
లెక్క తేలింది
సురేష్‌ : పురుషుల్లో 65 శాతం మంది భార్య చెప్పిన మాటను జవదాట్లేదు తెలుసా?
రాజేష్‌ : అవునా.. అంత కచ్చితంగా 65 శాతం మందేనని ఎలా చెప్పగలుగుతున్నావ్‌?
సురేష్‌ : మిగిలిన వారికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి..!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -