Sunday, October 12, 2025
E-PAPER
Homeసోపతినవ్వుల్‌ పువ్వుల్‌

నవ్వుల్‌ పువ్వుల్‌

- Advertisement -

అదృష్టం
కోర్టుకు వెళ్లారు భార్యాభర్తలు.
భర్తతో జడ్జి-
‘భార్యపై నీ అభియోగం ఏమిటి?’ అనడిగాడు.
‘ఆమె నాతో మాట్లాడటం మానేసింది’ ఆవేదన వ్యక్తం చేశాడు భర్త.
‘పిచ్చోడా.. దీనికి కోర్టుకెక్కడమెందుకు! ఆ అవకాశం దక్కడం నీ అదృష్టం’ అన్నాడు జడ్జి.

‘ఓపెన్‌’ చాయిస్‌

ముగ్గురు పిల్లలు మాట్లాడుకుంటున్నారు..
‘నేను పెద్దయ్యాక నలుపు కారు కొంటాను.. మా నాన్న తలవెంట్రుకలు నలుపు కాబట్టి’ అన్నాడు ఒకడు.
‘మా నాన్న తలవెంట్రుకలు తెలుపు కాబట్టి నేను తెలుపు కారు కొంటాను’ అన్నాడు మరొకడు.
‘మా నాన్న తలపై వెంట్రుకలు లేవు కాబట్టి ఓపెన్‌ టాప్‌ కారు కొంటాను’ అన్నాడు ఇంకొకడు.

చావు ఖాయం
తాగుబోతు భర్తను ఎలాగైనా దారికి తేవాలనుకుంది భార్య.
తాగివచ్చినప్పుడల్లా కోపగించకుండా ప్రేమతో వ్యవహరిస్తే మార్పు వస్తుందేమో చూడాలనుకుంది.
రోజులాగే పీకలదాకా తాగొచ్చాడు భర్త.
అతడిని చిరునవ్వుతో లోపలికి తీసుకెళ్లి కూర్చొబెట్టింది.

తల నిమురుతూ ప్రేమగా..
‘బాగా పొద్దుపోయింది. అన్నం తిని నిద్రపోండి’ అంది.
‘వామ్మో ఇంకేమైనా ఉందా? రాత్రంతా నేనిక్కడే ఉంటే మా ఆవిడ నన్ను చంపేస్తుంది’ అన్నాడు భర్త వణికిపోతూ.

ఈ జన్మలో కష్టమే..
కొడుకు (తండ్రితో) : బైక్‌ కొనివ్వమని రెండేండ్లుగా అడుగుతున్నా.. ఇంకెప్పుడు కొనిస్తావు?
తండ్రి : ఈసారి ఎగ్జామ్స్‌లో పాస్‌ అయితే కచ్చితంగా కొనిస్తా.
కొడుకు : అంటే.. నాకు ఈ జన్మలో బైక్‌ కొనే భాగ్యం లేదన్నమాట!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -