అర్హత
కొడుకు : నాన్నా, నేను పెళ్ళి చేసుకుంటాను.
తండ్రి : అయితే క్షమాపణలు చెప్పు.
కొడుకు : ఎందుకు? తప్పు చేయకుండా నేనెందుకు క్షమాపణ చెప్పాలి?
తండ్రి : ముందు క్షమాపణలు చెప్పు.
కొడుకు : సరే సారీ నాన్నా.
తండ్రి : గుడ్… ఇప్పుడు నువ్వు పెళ్ళికి అర్హుడివి. ఎప్పుడైతే నీ తప్పు లేకుండా సారీ చెప్పగలవో, అప్పుడు నువ్వు పెళ్ళికి సిద్ధం కావచ్చన్నమాట.
రెండూ ఒక్కటే!
భర్త : హిప్నాటిజం అంటే ఏమిటి?
భార్య : నాకు తెలిసినంత వరకూ… ఒక వ్యక్తిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని, తను చెప్పినట్లు చేయించుకోవడం.
భర్త : నాన్సెన్స్… తెలియకపోతే తెలియదని చెప్పు. దాన్ని పెళ్లి అంటారు కానీ, హిప్నాటిజం అని ఎందుకంటారు?
ఎంత తీరిక!
భర్త : హాయ్ డార్లింగ్… ఈ రోజు ఇల్లంతా ఇంత నీట్‌గా సర్దేశావు… నీ ఫోన్లో వాట్సప్ పని చేయలేదా?
భార్య : వాట్సప్ సంగతి దేవుడెరుగు. అసలు సెల్లే కనిపించకపోవడంతో దానికోసం వెతుకుతూ ఇల్లంతా సర్దేశాను.
నవ్వుల్ పువ్వుల్
- Advertisement -
- Advertisement -



